ఏసీబీకి చిక్కిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు..కేసును క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు రూ. 17 వేలు లంచం

చాంద్రాయణగుట్ట, వెలుగు : కేసును క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు లంచం తీసుకున్న ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్లగూడ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఓ వ్యక్తిపై ఉన్న కేసును క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు పోలీసులు రూ. 30 వేలు లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా చివరకు రూ. 15 వేలకు ఒప్పందం కుదిరింది. పోలీసులు లంచం అడిగిన విషయాన్ని సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. 

వారి సూచనతో బాధితుడు శుక్రవారం రాత్రి కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామకృష్ణకు రూ. 15 వేలు, మరో కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 2 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోద్భలం వల్లే తాము డబ్బులు తీసుకున్నట్లు కానిస్టేబుళ్లు చెప్పడంతో ఎస్సైని సైతం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ముగ్గురిని నాంపల్లి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో హాజరుపరిచారు.