హ్యాపీనా ధనశ్రీ, ఛాహల్ : అవును.. వాళ్లిద్దరికీ నెల రోజుల్లోనే విడాకులు వచ్చాయి..

హ్యాపీనా ధనశ్రీ, ఛాహల్ : అవును.. వాళ్లిద్దరికీ నెల రోజుల్లోనే విడాకులు వచ్చాయి..

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మలకు గురువారం(మార్చి 20) ముంబై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. చాహల్ తరపున వాదించిన న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా ఈ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.  న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా విడాకుల తర్వాత మాట్లాడారు. " కోర్టు విడాకుల డిక్రీని మంజూరు చేసింది. రెండు పార్టీల ఉమ్మడి పిటిషన్‌ను అంగీకరించింది. ఇకపై చాహల్, ధనశ్రీ భార్యాభర్తలు కారు". అని ఆయన అన్నారు. 

గురువారం (మార్చి 20) లోపు విడాకులు మంజూరు చేయాలనీ బాంబే హైకోర్టు బుధవారం (మార్చి 19) ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఉదయం 11:00 గంటల ప్రాంతంలో యుజ్వేంద్ర చాహల్ తన విడాకుల విచారణ కోసం బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చాడు. యుజ్వేంద్ర చాహల్ వచ్చిన తర్వాత ధనశ్రీ ప్రాంగణానికి వచ్చింది. ఇద్దరూ తమ ముఖానికి మాస్క్‌లు ధరించారు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్ లో వివాహం చేసుకున్నాడు. విడాకుల తర్వాత చాహల్ చెల్లించాల్సిన రూ. 4.75 కోట్ల భరణం చెల్లించినట్టు సమాచారం.
 
చాహల్ మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ఆడనుండడంతో రేపటి లోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు తెలిపింది.హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి కింద విడాకుల డిక్రీకి అవసరమైన ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను రద్దు చేయాలని కోర్టు కోరింది. 2025 ఐపీఎల్ సీజన్ లో చాహల్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. మెగా ఆక్షన్ లో రూ. 18 కోట్ల రూపాయలకు పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది.