కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి..స్పీకర్ కు శోభారాణి ఫిర్యాదు

 కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి..స్పీకర్ కు శోభారాణి ఫిర్యాదు

మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు మహిళ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి. ఈ మేరకు  కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని  స్పీకర్ గడ్డం ప్రసాద్ కు  వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడిన శోభారాణి..పాడి కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపిస్తున్నట్లు మాట్లాడారని అన్నారు శోభారాణి. తెలంగాణలో ఉన్న మహిళల మనోభావాలు దెబ్బతినేలా  కౌశిక్ రెడ్డి వాఖ్యలు చేశారని.. ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి రద్దు చేయాలన్నారు.  ఆంధ్రా,తెలంగాణ అంటూ విద్వేషాలు రెచ్చగొట్టేలా  కౌశిక్ రెడ్డితో కేసీఆర్ మాట్లాడిస్తున్నారా   అనేది  తెలియాలన్నారు.  

Also Read :- నా భుజానికి గాయం అయ్యింది

ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారిని కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావులు దీని మీద స్పందించాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత వాఖ్యలా లేక పార్టీ లైన్  అనే విషయం చెప్పాలన్నారు. మహిళల పట్ల చులకనగా మాట్లాడిన వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు శోభారాణి.