హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్‌ను విడుదల చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంపై మహిళా అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి మండిపడ్డారు. నియంత పాలన పోయి, ప్రజా పాలన వచ్చినందుకా ఈ చార్జిషీట్ అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రజా ప్రభుత్వంపై చార్జి షీట్ విడుదల చేశారని, అదే చార్జిషీట్‌ను ఆయన బీఆర్ఎస్కు ఇచ్చారని విమర్శించారు. ఈ రెండు పార్టీల జెండాలు వేర్వేరే అయినా, ఎజెండాలు మాత్రం ఒక్కటేనని కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని డెకాయిట్లను మించి దోచుకున్నది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు.