
ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారని బండ్ల ట్వీట్ చేశారు. తనకు పార్టీలో అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని గణేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బండ్ల గణేష్. గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆయనకు టికెట్ రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.