హైదరాబాద్ ​కస్టమర్లా.. మీ చేతికి డ్రగ్స్‌‌‌‌ ఇవ్వలేం.!

హైదరాబాద్ ​కస్టమర్లా.. మీ చేతికి డ్రగ్స్‌‌‌‌ ఇవ్వలేం.!
  • ఆన్​లైన్​లో పైసలు పంపితే రెండు గంటల్లో ప్లేస్ ​చెప్తాం
  • తెలంగాణ అంటే వణుకుతున్న బెంగళూరు డ్రగ్​పెడ్లర్లు
  • నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన ఎక్సైజ్‌‌‌‌,
  • ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్​ ఆఫీసర్లకు వింత అనుభవం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డ్రగ్స్ రవాణా, వాడకం​పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో బెంగళూరు డ్రగ్స్​పెడ్లర్లు బెంబేలెత్తుతున్నారట! ఇక్కడి నుంచి డ్రగ్స్ ఆర్డర్​ వస్తే తాము సప్లై చేయలేమని, కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లాలని చెప్తున్నారట!  హైదరాబాద్​ నుంచి ఎవరైనా డ్రగ్స్​ కోసం వస్తే  ముందుగా ఆన్​లైన్​లో  డబ్బులు చెల్లిస్తే రెండు గంటల తర్వాత చెత్త డబ్బాల వద్ద, చెట్ల కింద పెట్టి వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారట! తాజాగా ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌  డ్రగ్స్ కేసులో కీలక నిందితులను పట్టుకునేందుకు బెంగళూరు​వెళ్లిన ఎక్సైజ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌  ఆఫీసర్ల విచారణలో ఇలాంటి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 

డ్రగ్స్​సప్లయర్స్​కోసం గాలింపు.. 

ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ హాస్టల్​లో దొరికిన  డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరులోని డ్రగ్స్ సప్లయర్స్ కోసం గాలిస్తున్నారు.  ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లోని బాయ్స్‌‌‌‌ హాస్టల్స్‌‌‌‌లో శుక్రవారం ఎక్సైజ్ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో రూ.12 లక్షల విలువ చేసే ఎమ్‌‌‌‌డీఎమ్‌‌‌‌ఏ డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా బెంగళూరులోని  డ్రగ్స్‌‌‌‌ పెడ్లర్లను గుర్తించారు. డ్రగ్స్ కావాలని కాల్ చేస్తే హైదరాబాద్​నుంచి వచ్చిన కస్టమర్లను నమ్మబోమని, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పేమెంట్ చేస్తే 2 గంటల్లో డెలివరీ చేస్తామని సమాధానం ఇచ్చారు. 

ఆ తర్వాత ఫోన్​ చేస్తే  ‘‘ఫలానా చెత్త డబ్బాల్లో రెడ్ కలర్ కవర్ లో పెట్టాం.. ఫలానా చెట్టు కింది బ్లూ కలర్ కవర్‌‌‌‌‌‌‌‌లో ఉంచినం..  రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టినం తీసుకోండి’’ అంటూ లొకేషన్స్ షేర్ చేశారట. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.  ఈ క్రమంలోనే ఓ డ్రగ్ సప్లయర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు అధికారంలోకి వచ్చాక  నార్కోటిక్స్​బ్యూరో, టాస్క్​ఫోర్స్​ టీమ్​లతో డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి 938 కేసుల్లో 1,921 మందిని అరెస్ట్ చేశారు.  25 మంది కరడు గట్టిన గంజాయి స్మగ్లర్ల కోసం వేట సాగిస్తున్నారు. అందుకే హైదరాబాద్​ అంటేనే స్మగ్లర్ల వెన్నులో వణుకు పుడ్తున్నట్టు చర్చ నడుస్తున్నది.