
న్యూఢిల్లీ : ఇండియాలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీల) కు హబ్‌గా బెంగళూరు నిలిచింది. స్టాఫింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిజిటల్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు క్వార్టర్లలో జీసీసీల్లో పనిచేస్తున్న 36 శాతం వర్క్ ఫోర్స్ ఈ సిటీలోనే ఉన్నారు.14 శాతం మంది హైదరాబాద్‌లో ఉన్నారు. హై టెక్ సెక్టార్‌లో ఈ సిటీ ముందుంది.
హైదరాబాద్‌లోని జీసీసీ వర్క్‌ఫోర్స్‌లో 45 శాతం మంది క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, డేటా ఎనలిటిక్స్ వంటి టెక్నాలజీలను వాడుకొని గ్లోబల్‌గా సర్వీస్‌లు అందిస్తున్నారు. జీసీసీల ఉద్యోగుల్లో 33 శాతం మంది ముంబై, పూణెలో ఉండగా, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 22 శాతం మంది ఉన్నారు..