Viral Video: బిజీ రోడ్డులో కాలు మీద కాలేసుకుని టీ తాగుతూ వీడియో.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

Viral Video: బిజీ రోడ్డులో కాలు మీద కాలేసుకుని టీ తాగుతూ వీడియో.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

బెంగళూరు: కొందరు జనాల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న పిచ్చి వేలం వెర్రిగా మారింది. వైరల్ పిచ్చి ముదిరిపోయింది. లైక్స్, వ్యూస్, షేర్ల కోసం తల తిక్క పనులు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. బెంగళూరులో బిజీ రోడ్డులో నడిరోడ్డుపై కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఏదో ఘన కార్యం చేస్తున్నట్టుగా టీ తాగి ఓ వ్యక్తి వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించాడు.

వీడియో వైరల్ అయి ఫేమస్ అవ్వడం కోసం ఇలా పిచ్చి వేషాలు వేశాడు. ఈ వీడియో పోలీసుల వరకూ వెళ్లడంతో ఖాకీలు అతని తిక్క కుదిర్చారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. వైరల్ అవడం కోసం పిచ్చి పనులు చేస్తే అరెస్ట్ తప్పదని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన, పోలీసులు అతని తిక్క కుదిర్చిన వీడియో నెట్టింట వైరల్ అయింది.