
కర్నూలు : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటనపై కర్నూలు పట్టణంలో మాజీ మేయర్ బంగి అనంతయ్య నిరసన తెలిపారు. నల్లటి బట్టలు వేసుకుని.. నల్లజెండాలు ప్రదర్శిస్తూ.. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బర్రెపై ఊరేగుతూ నిరసన తెలిపారు. బుధవారపేట నుంచి కలెక్టరేట్ వరకు నల్ల జెండాలతో బర్రెపై ఊరేగింపు నిర్వహించారు మాజీ మేయర్ బంగి ఆనంతయ్య. కలెక్టరేట్ దగ్గర నల్ల జెండాలు ప్రదర్శించడంతో… పోలీసులు అతడిని అడ్డుకుని పంపించివేశారు.