భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కాదనుకున్న పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌పై ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు చేశారు. మాలిక్ ఆలోచనలు, ఆశిస్తున్నది వేరని మున్ముందు అతనికి మరిన్ని పెళ్లిళ్లు, విడాకులు అవుతాయని దుయ్యబట్టారు. సనా జావేద్‌తో అతని బంధం కొన్నాళ్లే అని, ఆ తరువాత ఆమెకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లాడతాడని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
సానియా మీర్జా- షోయబ్ మాలిక్‌ల వైవాహిక జీవితం తెగదెంపులు కావడం పట్ల తస్లీమా నస్రీన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో మాలిక్‌ను మంచోడు కాదన్న ఆమె, అతన్ని ఏరికోరి పెళ్లి చేకున్న సానియా ఎంపికను ప్రశ్నించారు.
"ఇన్నాళ్లు వారిద్దరూ సంతోషకరమైన జంట అని నేను అనుకున్నా.. నాదే పొరపాటు. తెలివైన అమ్మాయైన సానియా మీర్జా ఇంత చెడ్డోడిని ఎలా పెళ్లి చేసుకుంది! మాలిక్ ఏదో ఒకరోజు సనా జావేద్‌కి విడాకులిచ్చి X అనే మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు Xకి విడాకులు ఇచ్చి Yని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత Y కి విడాకులు ఇచ్చి Zని చేసుకుంటాడు. ఇదే అతని అలవాటు, ఆచారం. ఇస్లాం మీద నమ్మకం ఉంటే విడాకులు తీసుకోనవసరం లేదు. అతనికి నలుగురు భార్యలు ఉండవచ్చు. మాలిక్ ఒకవేళ ప్రవక్త యొక్క పాదముద్రలను అనుసరించాలనుకుంటే, అతను 11 మందిని చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.." అని నస్రీన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
I thought they were happy couple. I was wrong. How could Sania Mirza an intelligent girl had married such a bad boy! I think Shoaib Malik will divorce Sana Javed someday & marry X. Then he will divorce X and marry Y. Then he will divorce Y and marry Z. If he believes in Islam, he…
— taslima nasreen (@taslimanasreen) January 20, 2024
కాగా,13 ఏళ్ల సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం వారం రోజుల కిందటే విచ్చిన్నమైంది. షరియా చట్టాల ప్రకారం సానియాకు విడాకులిచ్చిన మాలిక్.. పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.
- Alhamdullilah ♥️
— Shoaib Malik ?? (@realshoaibmalik) January 20, 2024
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV