
సిల్హెట్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడ్డారు. విశ్వా ఫెర్నాండో (4/48), కాసున్ రజిత (3/56), లాహిరు కుమార (3/31) బౌలింగ్‌లో చెలరేగడంతో.. 32/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 188 రన్స్‌కు ఆలౌటైంది. తైజుల్ ఇస్లామ్ (47) పోరాడినా, లిటన్ దాస్ (25), ఖాలీద్ అహ్మద్ (22), షాహదత్ హుస్సేన్ (18), షోరిఫుల్ ఇస్లామ్ (15) ఫెయిలయ్యారు.
.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 119/5 స్కోరు చేసింది. ధనంజయ డిసిల్వా (23 బ్యాటింగ్), విశ్వా ఫెర్నాండో (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దిముత్ కరుణరత్నె (52) హాఫ్ సెంచరీ చేయగా, ఏంజెలో మాథ్యూస్ (22) ఫర్వాలేదనిపించాడు. నాహిద్ రాణా 2 వికెట్లు తీశారు. ఓవరాల్‌గా లంక 211రన్స్ ఆధిక్యంలో కొనసాగుతున్నది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది.