IND vs BAN 2024: బంగ్లాపై టీమిండియా బౌలర్ల పంజా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs BAN 2024: బంగ్లాపై టీమిండియా బౌలర్ల పంజా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించారు. బౌలర్లు అందరూ చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. 35 పరుగులు చేసిన మెహదీ హసన్ మిరాజ్ టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్య, సుందర్ లకు తలో వికెట్ లభించింది.     

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాకు మంచి ఆరంభం లభించలేదు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఓపెనర్లను చక చక పెవిలియన్ కు పంపి బంగ్లాను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రాకతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వస్తుంది. హృదయ్ (12), మహ్మద్దుల్లా(1), జాకీర్ అలీ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో తొలి 10 ఓవర్లలోనే సగం జట్టు పెవిలియన్ కు చేరింది. మొదటి అర్ధ భాగంలో కెప్టెన్ శాంటో ఒక్కడే 27 పరుగులు చేసి రాణించాడు. చివరి 10 ఓవర్లలో మెహదీ మిరాజ్ చివరి వరకు క్రీజ్ లోకి ఉండి జట్టు స్కోర్ ను 127 పరుగులకు చేర్చాడు.

Also Read :- అయ్యో బవుమా..ఐర్లాండ్‌తో చివరి వన్డేకు సఫారీ కెప్టెన్ దూరం

ఈ మ్యాచ్ లో మయాంక్ యాదవ్,నితీష్ రెడ్డి అరంగేట్రం చేశారు. మురళీ కార్తీక్ నుంచి మయాంక్.. పార్ధీవ్ పటేల్ నుంచి నితీష్ రెడ్డి క్యాప్ అందుకున్నారు. 4 ఓవర్లలో మయాంక్ 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. నితీష్ రెడ్డి రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చాడు.