T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం బంగ్లాదేశ్‌ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసింది. ఈ టీమ్‌ను లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నడిపించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా తస్కిన్ అహ్మద్ ఎంపికయ్యాడు. 

కెప్టెన్ శాంటోతో పాటు లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లాలతో కూడిన బంగ్లా బ్యాటింగ్ లైనప్‌ కాస్త బలంగానే ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షరిఫుల్ రహ్ ఇస్లాం, తంజిమ్ హసన్ రూపంలో నలుగురు పేసర్లు.. తన్వీర్ ఇస్లాం, మహేదీ హసన్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. జట్టులో ఐదారుగురు ఆల్‌రౌండర్లు ఉండటం వారికి అదనపు బలం.

టీ20 ప్రపంచ కప్‌కు బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, తన్వీర్ ఇస్లాం, మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్, షరిఫుల్ రహ్ ఇస్లాం, తంజిమ్ హసన్ షకీబ్.

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసన్ మహమూద్, అఫీఫ్ హుస్సేన్.

ఇటీవల స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ 4-1తో సొంతం చేసుకుంది. దీంతో వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. తదుపరి ప్రపంచ కప్‌కు సన్నద్ధం కావడానికి వారు సహ-ఆతిథ్య జట్టైన అమెరికాతో తలపడనున్నారు. మే 20 నుండి మే 24 వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది.

శ్రీలంక, దక్షిణాఫ్రికా, నేపాల్, నెదర్లాండ్స్‌తో  కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ డిలో ఉంది. వీరు జూన్ 7న డల్లాస్‌లో తమ సమీప ప్రత్యర్థి శ్రీలంకతో తలపడనున్నారు.