బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రిజర్వేషన్ నిరసన : అల్లర్లలో 115 మంది మృతి

బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రిజర్వేషన్ నిరసన : అల్లర్లలో 115 మంది మృతి

బంగ్లాదేశ్ దేశంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. గతకొన్ని రోజులుగా రిజర్వేషన్లు విషయంలో అక్కడి యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఆందోళనకారులు, పోలీసులు, ప్రభుత్వం మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఈ నిరసన కొనసాగుతుంది. దీంతో ప్రధాని హసీనా విదేశీ పర్యటన రద్దు చేసుకుంది.

రిజర్వేషన్లు రద్దు చేయాలని రోడ్డెక్కిన యువత

ఈ ఘర్షనల్లో ఇప్పటి వరకు 115 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని డాకాలోనే 52 మంది మృతి చెందారు. ఎక్కువ మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని అక్కడి మీడియా చెప్తుంది. రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమికూడడాన్ని నిషేధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు.

ఈ చావులకు ప్రధాని షేక్ హసీనానే కారణమని, ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  778 మంది ఇండియన్ స్టూడెట్స్ బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చారు. ఇంకా 15వేల మంది స్టూడెట్స్ సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

ఎందుకీ అల్లర్లు

స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్‌తో 1971లో జరిగిన విముక్తి పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలకు, వారసులకు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ ఇస్తుంది. లోకల్స్ కు 10 శాతం, లేడీస్ కు 10శాతం, మైనార్టీస్ కు 5శాతం, దివ్యాంగులకు 1శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది అక్కడి ప్రభుత్వం.

ప్రధాని హసీనాకు మద్దతునిచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో గవర్నమెంట్ అనుకూల వర్గాల వారే సర్కార్ కొలువులకు ఎంపికైతున్నారని అక్కడి యువత నిరసనకు దిగింది. ఈ రిజర్వేషన్ సిస్టమ్ రద్దు చేయాలంటూ డాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.