ఇండియాదే జోరు..తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్ 107/3

ఇండియాదే జోరు..తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్ 107/3
  • చెలరేగిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌
  • వర్షం వల్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు తీవ్ర అంతరాయం

కాన్పూర్‌ ‌‌‌‌‌‌‌: ఓవైపు వర్షం అంతరాయం.. మరోవైపు ఇండియా బౌలర్ల జోరుతో.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా  ఆధిపత్యమే కొనసాగింది. పేసర్‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌ (2/34)కు తోడుగా స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ (1/22) రాణించడంతో.. తొలి రోజు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 35 ఓవర్లలో 107/3 స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి మోమినల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ (40 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌ (6 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నజ్ముల్‌‌‌‌‌‌‌‌ శాంటో (31) కాసేపు పోరాడాడు. 

భారీ వర్షం వల్ల గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ చిత్తడిగా మారింది. ఔట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా ఆరకపోవడంతో  మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గంట ఆలస్యంగా మొదలైంది. టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ ఎంచుకున్నాడు. పేస్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్లీ వికెట్‌‌‌‌‌‌‌‌పై తొలి నుంచే ఒత్తిడి పెంచొచ్చనే ఉద్దేశంతో తుది జట్టులో ముగ్గురు పేసర్లను కంటిన్యూ చేశారు. ఈ వ్యూహం ఇండియాకు బాగా కలిసొచ్చింది. 

ఆకాశ్‌‌‌‌‌‌‌‌ అదుర్స్‌‌‌‌‌‌‌‌..

పేస్‌‌‌‌‌‌‌‌కు అనుకూలించిన వికెట్‌‌‌‌‌‌‌‌పై ఆరంభంలో బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌ మెరుగ్గా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కానీ వికెట్‌‌‌‌‌‌‌‌ తీయలేకపోయారు. దీంతో బంగ్లా ఓపెనర్లు షాద్మాన్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (24), జాకిర్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ (0) నెమ్మదిగా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టారు. ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ కాస్త బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించినా, జాకిర్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌కు పరిమితమయ్యాడు. 23 డాట్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ ఆడి క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఛేంజ్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌గా ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌ రావడంతో పరిస్థితి తారుమారైంది. ఆకాశ్‌‌‌‌‌‌‌‌ తన తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌ (9వ)లోనే ఓ ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో జాకిర్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. స్లిప్‌‌‌‌‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ అందుకున్నాడు. 

దీంతో బంగ్లా స్కోరు 26/1గా మారింది. తర్వాత కూడా కచ్చితమైన యాంగిల్స్‌‌‌‌‌‌‌‌, లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌తో ఆకాశ్‌‌‌‌‌‌‌‌ బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 13వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో షాద్మాన్‌‌‌‌‌‌‌‌ను వికెట్ల ముందు పట్టేశాడు. స్ట్రెయిట్ డెలివరీని ఆడే క్రమంలో షాద్మాన్‌‌‌‌‌‌‌‌ లైన్ మిస్సయి ఎల్బీ అయ్యాడు. రివ్యూకు వెళ్లగా ఫలితం ఇండియాకు అనుకూలంగా వచ్చింది. 29/2తో కష్టాల్లో పడిన బంగ్లాను మోమినల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌, నజ్ముల్‌‌‌‌‌‌‌‌ శాంటో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఒక్కో రన్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లడంతో లంచ్‌‌‌‌‌‌‌‌ వరకు బంగ్లా 74/2 స్కోరు చేసింది. 

ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ వర్షం పడటంతో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే 15 నిమిషాలు ఆలస్యంగా రెండో సెషన్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన బంగ్లాను ఈసారి అశ్విన్‌‌‌‌‌‌‌‌ దెబ్బకొట్టాడు. 29వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో శాంటోను ఎల్బీగా ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 51 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. మరో ఆరు ఓవర్ల తర్వాత భారీ వర్షం పడటం, బ్యాడ్‌‌‌‌‌‌‌‌ లైట్‌‌‌‌‌‌‌‌ వల్ల ఆట కొనసాగలేదు.

ఆసుపత్రి పాలైన బంగ్లా అభిమాని

మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చూసేందుకు బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన సూపర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌ రోబీ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. పులి వేషధారణతో ఉన్న అతను స్టాండ్‌‌‌‌‌‌‌‌–సిలో కూర్చొని మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను చూస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో అక్కడ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రమైన కడుపు నొప్పితో అతను పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లో హస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించి చికిత్స అందించారు. స్టాండ్స్‌‌‌‌‌‌‌‌లో జరిగిన దాడిలో కొంత మంది అభిమానులు తన కడుపులో కొట్టారని రోబీ ఆరోపించాడు. కానీ పోలీసులు దీన్ని ఖండించారు.