U19 Asia Cup: భారత్, పాకిస్థాన్ జట్లకు ఘోర అవమానం.. ఫైనల్లో బంగ్లాదేశ్,యూఏఈ

U19 Asia Cup: భారత్, పాకిస్థాన్ జట్లకు ఘోర అవమానం.. ఫైనల్లో బంగ్లాదేశ్,యూఏఈ

ఆసియాలో భారత్, పాకిస్థాన్ బలమైన జట్లు టోర్నీ ఎప్పుడు జరిగినా ఈ రెండు జట్లు ఫైనల్ కు వస్తాయి. ఒకవేళ అది సాధ్యం కానీ పక్షంలో కనీసం ఒక జట్టయినా ఫైనల్ కు చేరుతుంది. శ్రీలంక సెమీఫైనల్ కు రావడంలో విఫలం కావడంతో భారత్, ఫైనల్ మ్యాచ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఒక్కరోజే రెండు సంచలనాల ఫలితాలు నమోదయ్యాయి. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా  ఒక సెమీస్ లో భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇవ్వగా.. మరో సెమీస్ లో యూఏఈ పాక్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 

పసికూనలైనా బంగ్లాదేశ్, యూఏఈలు ఈ టోర్నీలో ఫైనల్ కు అర్హత సాధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. (డిసెంబర్‌ 15) జరిగిన తొలి  సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. యూఏఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ అయాన్‌ ఖాన్‌ (55) అర్దసెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. యూఏఈ బౌలర్లు ధాటికి 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సాద్‌ బేగ్‌ (50), అజాన్‌ అవైస్‌ (41) రాణించినా జట్టు విజయానికి అవి సరిపోలేదు.

మరో సెమీ ఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు .. 42.4 ఓవర్లలో 188 పరుగులే చేసి ఆలౌటైంది. ముషీర్‌ ఖాన్‌ (50), మురుగన్‌ అభిషేక్‌ (62) అర్ధసెంచరీలతో చేసినా మిగిలిన వారందరూ విఫలం కావడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌.. అరీఫుల్‌ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసుకుంది.