15 ఏండ్ల తర్వాత..విండీస్‌‌పై బంగ్లా టెస్టు విక్టరీ

15 ఏండ్ల తర్వాత..విండీస్‌‌పై బంగ్లా టెస్టు విక్టరీ

కింగ్‌‌‌‌‌‌‌‌స్టన్‌‌‌‌‌‌‌‌ (జమైకా) : బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (5/50) చెలరేగడంతో.. నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 101 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఇరుజట్లు 1–1తో డ్రా చేసుకున్నాయి. 15 ఏండ్ల తర్వాత కరీబియన్‌‌‌‌‌‌‌‌ జట్టుపై బంగ్లా గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో విండీస్‌‌‌‌‌‌‌‌లో ఆడిన ఏడు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లోనూ బంగ్లా ఓటమిపాలైంది. 

బంగ్లా ఇచ్చిన 287 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌లో బుధవారం బరిలోకి దిగిన విండీస్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 50 ఓవర్లలో 185 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. కావెమ్‌‌‌‌‌‌‌‌ హోడ్జ్‌‌‌‌‌‌‌‌ (55), బ్రాత్‌‌‌‌‌‌‌‌వైట్‌‌‌‌‌‌‌‌ (43) ఫర్వాలేదనిపించారు. 42 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో చివరి 6 వికెట్లు పడటంతో విండీస్‌‌‌‌‌‌‌‌ కోలుకోలేకపోయింది.  తైజుల్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, తస్కిన్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డులు లభించాయి.