క్రికెట్ లో న్యూజిలాండ్ జట్టు ఎంత ప్రమాదకారి జట్టు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సొంతగడ్డపై కివీస్ ను ఓడించాలంటే ఎంత పెద్ద జట్టుకైనా శక్తికి మించిన సవాలే. అయితే పసికూన బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. అది కూడా మాములు విజయం కాదు.. ఏకంగా భారీ విజయాన్నే నమోదు చేసింది. కివీస్ ను సొంతగడ్డపై 100 పరుగుల మార్క్ టచ్ చేయనీయకుండా చిత్తు చేసి న్యూజి లాండ్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది.
మూడు వన్డేలో సిరీస్ లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన చివరిదైన మూడో టీ20 లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ ఆరంభంలోనే రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగినా.. అనామల్ హక్, శాంటో భారీ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ కు విజయాన్ని అందించారు. శాంటో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. హక్ 37 పరుగులు చేసాడు. కివీస్ బౌలర్లలో విలియం రోర్క్ కు ఒక వికెట్ దక్కింది.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ కేవలం 98 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు ఆరంభం నుంచి ఎటాకింగ్ చేస్తూ కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి కివీస్ ను ఒత్తిడిలో పడేసారు. షోరిఫుల్ ఇస్లాం, షకీబ్, సౌమ్య సర్కార్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. ముస్తాఫిజార్ కు ఒక వికెట్ దక్కింది. కివీస్ జట్టులో విల్ యంగ్ 26 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేలు న్యూజిలాండ్ గెలిచిన సంగతి తెలిసిందే.
HISTORIC WIN ?✌️
— Shawon Mondal (@SK_Shrabon17) December 23, 2023
Bangladesh defeated New Zealand very convincingly with 34.5 overs to spare. First ever ODI victory vs New Zealand in New Zealand.?
Congratulations @BCBtigers ??#BdCricket | #NZvsBAN | #Cricket pic.twitter.com/HmEpOLnosu