ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం

ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం

తాత్కాలికంగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలవుగా ఉన్న ఆగస్ట్ 15 రోజు సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ ప్రధాని షేక్ హాసినా తండ్రి, బంగ్లాదేశ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు సంతాప దినంగా ఆగస్ట్ 15ను సెలవు దినంగా పాటించేవారు. షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమకారుడు.. అతనికి బంగాబంధు అని బిరుదు కూడా ఉంది. షేక్ ముజిబుర్ రెహమాన్ స్వతంత్ర బంగ్లాదేశ్ కు మొదటి ప్రధాని కూడా. ఆయన 1975 ఆగస్ట్ 15న హత్యకు గురైయ్యారు. అప్పటి నుంచి ముజిబుర్ రెహమాన్ హత్యకు సంతాప దినంగా ఆగస్ట్ 15న జాతీయ సెలవు దినంగా కొనసాగిస్తున్నారు. 

Also Read:-డేరాబాబాకు బెయిల్​ 21 రోజులు మంజూరు చేసిన కోర్టు

తాజాగా బంగ్లాదేశ్ అల్లర్లు, రాజకీయ అస్థిరత్వత కారణంగా ముహమ్మద్ యూనస్ ఆద్వర్యంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. సలహాదారు మండలి, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆగస్ట్ 15 షేక్ ముజిబుర్ రెహమాన్ సంతాప దినంగా ఉన్న సెలవుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ హింసాత్మక నిరసనల కారణంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయింది. కోపోద్రిక్తులైన విద్యార్థులు, నిరసనకారులు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. ఆయన పేరు మీద ఉన్న మ్యూజియాన్ని కూడా తగులబెట్టారు.