బంగ్లాదేశ్లో ఆందోళనలు అల్లర్లు..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా 

బంగ్లాదేశ్లో ఆందోళనలు అల్లర్లు..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా 

బంగ్లాదేశ్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. గత కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్న హింస, అశాంతి కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత తాజాగా శనివారం ఆగస్టు10, 2024న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాలని డిమాండ్ ఆందోళనకు దిగారు.

కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభు త్వాన్ని సంప్రదించకుండా చీఫ్ జస్టిస్ ఫుల్ కోర్టు సమావేశం నిర్వహించడంతో  నిరసనలు చెలరేగాయి.దీంతో  చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్  రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం బంగ్లా దేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ను సంప్రదించి తన రాజీనామాను సమర్పించున్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయవ్యవస్థను కాపాడేందుకు, ఆందోళన కారుల డిమాండ్లను గౌరవించేందుకు తాను ఏంచేయాలో నిర్ణయించాలని న్యాయ సలహాదారు ప్రొఫెసర్ ఆసిఫ్ నజ్రుల్ ను కోరారు. 

‘‘ఫాసిజంతో పోషింపబడి, వివిధ అకృత్యాలకు పాల్పడిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు లేకుండానే ఫుల్‌ కోర్టు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓడిపోయిన శక్తుల కుట్రను సహించబోమని.. విద్యార్థులు, న్యాయవాదులు ఇప్పటికే నిరసనకు దిగారు." అని నిరసనకారులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
 
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఆందోళణలతో ఆమె రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆమె15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి తర్వాతకూడా తాజాగా నిరసనలు చెలరేగాయి. హసీనా రాజీనామా తర్వాత 232 మంది అల్లర్లలో చనిపోయారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలో చనిపోయిన వారి సంఖ్య 560కి చేరింది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది. 

హిందువులపై దాడులు..నిరసనలు

హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ లోని మైనార్టీ హిందువులను లక్ష్యంగా దాడులు జరిగాయి. మెజారిటీ ముస్లింలు ఉన్న బంగ్లాదేశ్ లో హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలు లక్ష్యంగా హింసాకాండ చెలరేగింది. ఈ దాడుల్లో ఓ టీచర్ బలయ్యారు. 45 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 

బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీ హిందువులను రక్షించాలని కోరుతూ శుక్రవారం రాజధాని ఢాకాలో నిరసనలు వెల్లువెత్తాయి. శాంతిని నెలకొల్పాలని విజ్ణప్తి చేశారు. ఆగస్టు 5 నుంచి దేశంలోని 64 జిల్లాల్లో కనీనం 52 జిల్లాలు మత హింసకు గురయ్యాయని బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ క్రిష్టియన్ యూనిటీ కౌన్సిల్ అంచనా వేసింది. అల్లర్లను అదుపు చేయాలని ప్రధాని యూనిస్ ను సాయం కోరారు. 

పెరుగే దేశం బంగ్లాదేశ్ లో కొనసాగుతునన్ ఉద్రికత్త క్రమంలో ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ లో నివసించే భారతీయులు, హిందువులు, ఇతర మైనార్టీ వర్గాల భద్రతపై అక్కడి అధికారులతో కేంద్ర కమిటీ సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం తెలిపారు.