క్రికెట్ లో ఫన్నీ సంఘటనలు జరగడం సహజమే. కొన్ని సార్లు అనుకోకుండా చేసే పనులకు అసలు నవ్వాగదు. DRS విషయంలో అపుడప్పుడు పొరపాటున రివ్యూ తీసుకోవడం మనం చూశాం గానీ.. కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్న రివ్యూ తీసుకోవడం షాకింగ్ కు గురి చేస్తుంది. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో తీసుకున్న ఒక నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది.
చటోగ్రామ్‌లో జరుగుతున్న ఈ టెస్టులో శ్రీలంక మొదటి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు మదుష్కా, కరుణ రత్నే మంచి స్టార్ట్ ఇవ్వడంతో శుభారంభం లభించింది. సాఫీగా సాగిపోతున్న లంక ఇన్నింగ్స్ లో 44 ఓవర్లో అనూహ్య సంఘటన ఒకటి జరిగింది. తైజుల్ ఇస్లాం వేసిన ఐదో బంతిని కుశాల్ మెండిస్ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడాడు. బంతి స్పష్టంగా బ్యాట్ మిడిల్ లో తగిలినా.. బంగ్లా కెప్టెన్ శాంటో రివ్యూకు వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది. రీప్లేలో కూడా బంతి బ్యాట్ మధ్యలో తగిలినట్లు చూపించింది. దీంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు.
Also Read: లక్నో vs పంజాబ్.. గెలుపెవరిది..?
స్లిప్ లో ఉన్న శాంటోకు అర్ధం కాకపోయినా.. బౌలర్ తైజుల్ ఇస్లాంతో పాటు ఫీల్డర్ కూడా రివ్యూకు వెళ్ళమని కోరడం షాకింగ్ కు గురి చేసింది. క్రికెట్ లోనే ఇదొక ఆల్ టైం చెత్త రివ్యూగా మిగిలిపోయింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు అట ముగిసేసరికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మదుష్కా(57), కరుణ రత్నే(86), కుశాల్ మెండిస్ (93) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆట ముగిసే సమయానికి చండీమల్(34), ధనంజయ్ డిసిల్వా(14) క్రీజ్ లో ఉన్నారు.
What just happened? 👀
— FanCode (@FanCode) March 30, 2024
.
.#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov