T20 World Cup 2024: చీట్ చేసిన బంగ్లా క్రికెటర్లు.. పట్టించుకోని అంపైర్

T20 World Cup 2024: చీట్ చేసిన బంగ్లా క్రికెటర్లు.. పట్టించుకోని అంపైర్

టీ20 వరల్డ్ కప్ లో బంగ్లా క్రికెటర్లు తమ చెత్త బుద్ధిని మరోసారి బయటపెట్టారు. సోమవారం (జూన్ 17) సెయింట్ విన్సెట్ వేదికగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో తొండాట ఆడారు. సందీప్ లామిచానే ఇన్నింగ్స్ 14 ఓవర్ తొలి బంతిని తాంజిమ్ హసన్ సాకిబ్ డిఫెన్సె ఆడాడు. అయితే బంతి ప్యాడ్లకు తగలడంతో నేపాల్ క్రికెటర్లు అంపైర్ కు అప్పీల్ చేయగా.. ఎల్‌బీడబ్ల్యూగా అయినట్లుగా అంపైర్ ప్రకటించాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో నేపాల్ క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. 

బ్యాటర్ తాంజిమ్ హసన్ తనను తాను ఔట్ గా భావించుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగి వెళ్తున్నాడు. ఈ దశలో నాన్-స్ట్రైకర్ జాకర్ అలీ డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ సైగలు చేశాడు. జాకర్ అలీ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ సహాయం కోరినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. మరోవైపు డీఆర్ఎస్ సమయం కూడా అయిపోయింది. అయితే అంపైర్ పట్టించుకోపోడంతో బంగ్లా రివ్యూకు వెళ్లారు. రివ్యూలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్లు చూపించింది. దీంతో ఎల్‌బీడబ్ల్యూ నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకొని నాటౌట్ గా ప్రకటించాడు. 

ఈ సంఘటన తర్వాత బంగ్లా క్రికెటర్లపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆన్ ఫీల్డ్ అంపైర్ పైనే విరుచుకుపడుతున్నారు. ఆటగాళ్లను గమనించకుండా నిద్రపోతున్నాడని.. డీఆర్ఎస్ సమయం చూసుకోలేదని మండిపడుతున్నారు. 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తాంజిమ్ హసన్ సాకిబ్ ఆ తర్వాత బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సెయింట్ విన్సెంట్‌లోని కింగ్‌స్‌టౌన్‌లోని ఆర్నోస్ వేల్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్​విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టుకు నేపాల్ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. దీంతో బంగ్లా19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్​ 19.2  ఓవర్లలో 85 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో బంగ్తాదేశ్​సూపర్–8కు అర్హత సాధించింది.బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన సాకిబ్​ మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది.