
చట్టోగ్రామ్: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 64 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. షాద్‌మన్ ఇస్లాం (120) సెంచరీతో రాణించడంతో.. మంగళవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 291/7 స్కోరు చేసింది. మెహిదీ హసన్ మిరాజ్ (16 బ్యాటింగ్), తైజుల్ ఇస్లాం (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ముష్పికర్ రహీమ్ (40), అనాముల్ హక్ (39), మోమినల్ హక్ (33), నజ్ముల్ శాంటో (23) ఫర్వాలేదనిపించారు. జాకర్ అలీ (5), నయీమ్ హసన్ (3) నిరాశపర్చారు. విన్సెంట్ మసెకస 3 వికెట్లు తీశాడు. అంతకుముందు 227/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 90.1 ఓవర్లలో 227 రన్స్‌కు ఆలౌటైంది. తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లు పడగొట్టాడు.