BAN vs RSA: మెహిదీ అసమాన పోరాటం.. WTC ఎలైట్ లిస్టులో చోటు

BAN vs RSA: మెహిదీ అసమాన పోరాటం.. WTC ఎలైట్ లిస్టులో చోటు

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో మెహిదీ హసన్ మిరాజ్(77 నాటౌట్) అర్ధశతకం సాధించడంతో పోరాడుతోంది. వాస్తవానికి ఈ టెస్ట్ తొలి మూడు రోజుల్లోనే ముగిసేలా కనిపించింది. అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఈ బంగ్లా ఆల్‌రౌండర్ ఒంటిచేత్తో జట్టును సజీవంగా నిలిపాడు. ఈ ప్రదర్శనతో అతను ప్రస్తుత WTC సైకిల్‌ ఎలైట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు.

ALSO READ | New Zealand Cricket: తాత్కాలిక కెప్టెన్‌గా సాంట్నర్‌.. వన్డే, టీ20 జట్ల ప్రకటన

ఈ 26 ఏళ్ల ఆల్ రౌండర్ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్, వికెట్ టేకర్. 16 ఇన్నింగ్స్‌లలో 42.66 సగటుతో 512 పరుగులు చేశాడు. 34 వికెట్లు తీశాడు. ఇలా ఒక WTC ఎడిషన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు, 30 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడవ ఆటగాడు. అంతకుముందు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ ఘనత సాధించారు. 

  • బెన్ స్టోక్స్: 1334 పరుగులు, 34 వికెట్లు (WTC 2019-21)
  • బెన్ స్టోక్స్: 971 పరుగులు, 30 వికెట్లు (WTC 2021-23)
  • రవీంద్ర జడేజా: 721 పరుగులు, 47 వికెట్లు (WTC 2021-23)
  • మెహిదీ హసన్: 512 పరుగులు, 34 వికెట్లు (WTC 2023-25)

బంగ్లాదేశ్ vs దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ స్కోర్లు

  • బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 106 
  • దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 308 (వెర్రేన్నే-114)
  • బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 267/7 (మెహిదీ హసన్ - 77 నాటౌట్)