సూపర్–8కు బంగ్లాదేశ్.. జూన్​ 22న భారత్​తో ఢీ

సూపర్–8కు బంగ్లాదేశ్.. జూన్​ 22న భారత్​తో ఢీ

టీ20 వరల్డ్ కప్‌‌లో బంగ్లాదేశ్ సూపర్-8కి చేరుకుంది.సెయింట్ విన్సెంట్‌లోని కింగ్‌స్‌టౌన్‌లోని ఆర్నోస్ వేల్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్​విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టుకు నేపాల్ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. దీంతో బంగ్లా19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ లిట్టన్ దాస్ 10 పరుగులు, షకీబ్ 17 పరుగులు, మహ్మదుల్లా 13 పరుగులు, జకేర్ అలీ 12 పరుగులు, రషీద్​ హోస్సెన్13 పరుగులు, తష్కిన్​ అహ్మద్12 పరుగులు చేశారు. నేపాల్​బౌలర్లలో సోమ్ పాల్, దిపేంద్ర సింగ్, రోహిత్ లు తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్​ను బంగ్లా బౌలర్ టాంజిమ్ హసన్ సాకిబ్ దెబ్బ కొట్టాడు.  అద్భుతమైన బౌలింగ్ తో నేపాల్​వెన్ను విరిచాడు. సాకిబ్​4 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. అతడికి తోడు ముస్తాఫీజర్​ రహ్మాన్​ కూడా వికెట్లతో చెలరేగడంతో నేపాల్​19.2  ఓవర్లలో 85 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో బంగ్తాదేశ్​సూపర్–8కు అర్హత సాధించింది.బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన సాకిబ్​ మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​అవార్డు లభించింది.

కాగా, సూపర్-8లో బంగ్లాదేశ్, టీమిండియాతో తలపడనుంది.ఈనెల 22న ఆంటిగ్వా వేదికగా భారత్‌ను ఢీకొట్టనుంది.