వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. పసికూనగా భావించే బంగ్లాదేశ్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా లను సైతం వెనక్కి నెట్టింది. పాకిస్థాన్ పై 2-0 తేడాతో సిరీస్ గెలవడంతో బంగ్లాదేశ్ కు అనుకూలంగా మారింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో 45.83 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది.
ఈ లిస్ట్ లో భారత్ 68.52 శాతం విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లా నాలుగో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్, వెస్టిండీస్ చివరి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. భారత్, ఆస్ట్రేలియా జట్లు మరోసారి ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ చెప్పుకొస్తున్నారు.
వచ్చే ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ మంగళవారం (సెప్టెంబర్ 3) ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది.
WTC Points Table 🏆 Bangladesh 🇧🇩 moves up to No. 4, while Pakistan stays at No. 8 🏏 pic.twitter.com/uutdH1nbQT
— CricketGully (@thecricketgully) September 3, 2024