- హనీట్రాప్‌తో రప్పించి చంపేసిన హంతకులు
- పోలీసుల విచారణలో దారుణాలు వెలుగులోకి
- డెడ్‌బాడీని గుర్తించొద్దని ముక్కలుగా నరికినట్లు చెప్పిన నిందితుడు
- బాడీ పార్ట్స్‌ను కోల్‌కతా నలువైపులా పడేశామని వెల్లడి
- ఎంపీ మర్డర్‌కు రూ.5 కోట్ల డీల్ కుదిరిందని పోలీసుల అనుమానం
కోల్‌కతా: బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ ఉల్ అజీమ్ అనార్ హత్య కేసులో దారుణ విషయాలు బయటపడ్డాయి. యువతితో హనీ ట్రాప్ ద్వారా ఎంపీని ఓ ఆపార్ట్‌మెంట్‌కు రప్పించి దారుణంగా చంపేశారు. ఆపై డెడ్‌బాడీని గుర్తించకుండా ఉండేందుకు చర్మం ఒలిచి, ముక్కలుముక్కలుగా నరికేశారు. అనంతరం వాటిని కవర్లలో పెట్టి కోల్‌కతా సిటీ నలువైపులా విసిరేశారు. కొద్దిరోజుల కింద ట్రీట్మెంట్ కోసం బెంగాల్‌కు వచ్చిన అన్వర్ ఉల్ అజీమ్ హత్యకు గురయ్యారు. ఇందులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన నలుగురి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు.. వారిలో ఒకరైన జిహాద్ హవ్లాదార్ను అరెస్ట్ చేశారు.
హనీ ట్రాప్‌లోకి లాగి..
బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ ట్రీట్మెంట్ కోసం మే 12న బెంగాల్‌కు వచ్చారు. బారానగర్‌లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ ఇంట్లో దిగారు. 13న ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆయన తిరిగిరాలేదు. సెర్చింగ్ ప్రారంభించిన పోలీసులు ఎంపీ హనీ ట్రాప్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఓ మహిళ సహా మరో ఇద్దరితో కలిసి ఆయన కోల్‌కతా శివారులోని ఖాళీగా ఉన్న తన స్నేహితుడి అపార్ట్మెంట్లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. రూమ్‌లోకి వెళ్లిన వెంటనే ఆయనను గొంతునులిమి చంపేసినట్లు నిందితుడు హవ్లాదార్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించాడు. ‘‘ఎంపీని చంపిన తర్వాత హవ్లాదార్ తన అనుచరులతో కలిసి ఆయన చర్మం ఒలిచారు. ఆపై బాడీని చిన్నచిన్న ముక్కలుగా చేశారు. దుర్వాసన రాకుండా శరీర భాగాలకు పసుపు రాశారు. అపార్ట్‌మెంట్‌నుంచి బాడీ పార్ట్స్ ని సూట్‌కేస్‌లో తీసుకెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. బాడీ పార్ట్స్‌ను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్‌కతా నలుమూలల్లో పడేశారు”అని బెంగాల్ సీఐడీ పోలీసులు తెలిపారు. కాగా, బంగ్లా సంతతికి చెందిన అమెరికన్ సిటిజన్ అఖ్తరుజ్జమాన్ తమకు ఎంపీని చంపాలని సూచించినట్లు హవ్లాదార్ పోలీసులకు తెలిపాడు. ఎంపీ అన్వర్‌కు అక్తరుజ్జామన్ పాత స్నేహితుడని పోలీసులు గుర్తించారు. మరోవైపు, హనీ ట్రాప్ చేసిన బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్ శిలాస్తి రెహమాన్‌ను ఢాకాలో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.