Champions Trophy 2025: లిటన్ దాస్, షకీబ్‌కు నో ఛాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బంగ్లాదేశ్ తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆదివారం (జనవరి 12) బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ లిట్టన్ దాస్‌లకు చోటు దక్కలేదు. ఎన్నో సంవత్సరాలుగా బంగ్లా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న షకీబ్ పై వేటు పడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత ఏడాది ఐదు వన్డేల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన లిటన్ దాస్ కు సెలక్టర్లు చోటివ్వలేదు.   

పాకిస్థాన్, యూఏఈ వేదికలుగా జరగబోయే ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్ గా వహరించనున్నాడు. సీనియర్ ప్లేయర్లు మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్‌లు జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ బంగ్లాదేశ్ ఉంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఇదే గ్రూప్ లో ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20 న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 24 న న్యూజిలాండ్ తో.. ఫిబ్రవరి 27 న పాకిస్థాన్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.           

Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు బుమ్రా దూరం

ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ , తంజిద్ హసన్, తాంజిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ , పర్వేజ్ హొస్సేన్, తంజైమ్ హసన్ షకీబ్, నసుమ్ అహ్మద్, నహిద్ రానా