IPL 2024: సందిగ్ధంలో బంగ్లా క్రికెటర్లు.. ఐపీఎల్‌లో ఆడటానికి అనుమతివ్వని బంగ్లా బోర్డు!

IPL 2024: సందిగ్ధంలో బంగ్లా క్రికెటర్లు.. ఐపీఎల్‌లో ఆడటానికి అనుమతివ్వని బంగ్లా బోర్డు!

2024 టీ20 కప్ ఉండడంతో అన్ని దేశాలు ఐపీఎల్ ను ప్రాక్టీస్ గా ఉపయోగిచుకోవాలని భావిస్తున్నాయి. గతేడాది దూరంగా ఉన్న కొంతమంది ఆసీస్ క్రికెటర్లు ఈ సారి వేలానికి అందుబాటులో ఉండనున్నారు. అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ లో ఆడే విషయంలో స్పష్టత రావట్లేదు. ఆ దేశ క్రికెట్ బోర్డు బంగ్లా క్రికెటర్లను ఐపీఎల్ ఆడటానికి అనుమతి ఇవ్వట్లేదని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో వారి అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఉన్నట్లు తెలుస్తుంది.
 
2024 ఐపీఎల్ మార్చ్ 23 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో బంగ్లాదేశ్ లో శ్రీలంక పర్యటించనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు టీ20 సిరీస్ ఆడనుంది. BCB క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ IPL సమయంలో అంతర్జాతీయ మ్యాచ్ లు ఉన్నాయని.. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లను జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేసారు. 

ఐపీఎల్ 2024 కు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ షకీబల్ హసన్, లిటన్ దాస్ తప్పుకున్నట్లు ప్రకటించాడు. వీరిద్దరూ గతంలో కేకేఆర్ తరపున ఆడారు. ప్రస్తుతం ముగ్గురు బంగ్లా క్రికెటర్లు మాత్రమే ఐపీఎల్ లో ఆడే అవకాశం ఉంది. వీరిలో ముస్తాఫిజార్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. ముస్తాఫిజార్ ఇప్పటికే ఐపీఎల్ ఆడగా..షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డిసెంబర్ 19 న దుబాయ్ లో ఐపీఎల్ వేలం జరుగుతుంది.