Bangladesh : ఖలీదా జియా విడుదలకు ప్రెసిడెంట్ ఆదేశం

Bangladesh : ఖలీదా జియా విడుదలకు ప్రెసిడెంట్ ఆదేశం

ఢాకా: అవినీతి కేసులో జైలులో ఉన్న ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ పీ) చైర్ పర్సన్, మాజీ ప్రధాని బేగమ్ ఖలీదా జియాను వెంటనే రిలీజ్ చేయాలంటూ సోమవారం రాత్రి దేశ అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు.

 ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రెసిడెంట్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత పార్లమెంట్ ను ప్రెసిడెంట్  రద్దు చేసేందుకు కూడా ప్రతిపక్ష నేతలు ఈ సమావేశంలో అంగీకరించినట్లు తెలిపాయి.