ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అలర్లు హింసాత్మకంగా మారాయి. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంపై అక్కడ గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లో ఇప్పటి వరకు దాదాపు 32 మంది చనిపోయారు.
నిరసనకారులు టీవీ ప్రధాన కార్యాలయానికి నిప్పు పెట్టడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది నిరసనకారులు ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. దాదాపు 60 వాహనాలకు, కార్యాలయ భవనాన్ని తగలబెట్టారు. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు,యూనివర్శిటీలు మూతపడ్డాయి.
1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలని చాలా రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారాంగానే రిక్రూట్ జరగాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లపై బంగ్లా సుప్రీం కోర్టు నిషేదించింది. కానీ బంగ్లా ప్రధాని షేక్ హసినా నిర్ణయాన్ని అమలు చేయడం లేదు.