బంగ్లాదేశ్లో కర్ఫ్యూ.. స్వదేశానికి 400 మంది భారతీయులు

బంగ్లాదేశ్లో కర్ఫ్యూ.. స్వదేశానికి 400 మంది భారతీయులు

బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీని ప్రకటించిన షేక్ హసీనా ప్రభుత్వం.. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను తొలగించాలని.. ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు కల్పించాలని గత కొద్ది రోజులు యూనివర్సిటీలు, కాలేజీల్లో  విద్యార్థుల చేస్తున్న ఆందోళనలు పెద్దఎత్తున చెలరేగడంతో దేశమంతా కర్ఫ్యూ విధించారు. విద్యార్థుల ఆందోళనలు ముదిరి హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 105 మంది చనిపోయారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ లో  చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ తిరిగి స్వదేశానికివస్తున్నారు. శనివారం (జూలై 20) దాదాపు 400 మంది విద్యార్థులు సరిహద్దుల ద్వారా మేఘాలయకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.బంగ్లాదేశ్ లో దాదాపు 850 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని  విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 

 నిరసన కారుల డిమాండ్ ..

ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించింది. శాంతి భద్రతలను కాపాడేందుకు సైనిక బలగాలను మోహరించాలని ఆదేశించింది. యూనివర్సిటీల క్యాంపస్ లను మూసివేశారు. దేశ రాజధాని ఢాకా అంతటా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు.  దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్థానిక వార్తా సైట్లను కూడా మూసివేశారు. 

బంగ్లాదేశ్ అల్లర్లపై అక్కడి లాయర్లు తీవ్రంగా స్పందించారు. షేక్ హసీనా ప్రభుత్వం దూరదృష్టి లేని అసమర్థ విధాన పాలన అని వాక్ స్వాతంత్ర్య న్యాయవాది సాద్ అహ్మదీ ఆరోపించారు.  30 శాతం రిజర్వేషన్లు ఒకవర్గానికి చెందిన యువతకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు దారి తీస్తుందన్నారు సాద్ అహ్మదీ.