నేపియర్ : సొంతగడ్డపై వరుసగా 17 వన్డేల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ జైత్రయాత్రకు బంగ్లాదేశ్ బ్రేక్ వేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన కివీస్ 2–1తో సిరీస్ గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ 31.4 ఓవర్లలో 98 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ విల్ యంగ్ (26) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ (3/14), షోరిఫుల్ ఇస్లాం (3/22), సౌమ్య సర్కార్ (3/18) తలో మూడు వికెట్లతో కివీస్‌ను దెబ్బకొట్టారు. తర్వాత కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (51 నాటౌట్) ఫిఫ్టీతో రాణించడంతో బంగ్లా 15.1 ఓవర్లలో 99/1 స్కోరు చేసి గెలిచింది. తంజిమ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, విల్ యంగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.