పులి దెబ్బ చూపించారుగా: తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై నెగ్గిన బంగ్లాదేశ్

పులి దెబ్బ చూపించారుగా: తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై నెగ్గిన బంగ్లాదేశ్

స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టు ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించింది. టెస్టు క్రికెట్ లో న్యూజిలాండ్ కు షాకిస్తూ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ పై రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో కివీస్ పై తొలి టెస్టులో నెగ్గి బోణీ కొట్టింది. గతంలో ఆస్ట్రేలియా జట్టుకు చిత్తు చేసిన బంగ్లా తాజాగా న్యూజిలాండ్ పై 150 పరుగుల భారీ తేడాతో గెలిచి పసికూనలం అనే ట్యాగ్ నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. 

332 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన న్యూజీలాండ్ బంగ్లా బౌలర్ల ధాటికి 181 కుప్పకూలింది. తైజుల్ ఇస్లాం 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. నయీమ్ హసన్ 2 వికెట్లు తీసుకున్నాడు. 7 వికెట్లకు 112 పరుగులతో 5 వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ తమ చివరి మూడు వికెట్లను 71 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 58 పరుగులు చేసిన డారిల్ మిచెల్ న్యూజీలాండ్ టాప్ స్కోరర్. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు డాక వేదికగా డిసెంబర్ 6 న జరుగుతుంది. 

ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ హసన్ రాయ్(86) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్ లో 310 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ విలియంసన్(104) సెంచరీతో 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. బంగ్లా కెప్టెన్ శాంటో(105) సెంచరీతో రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 338 పరుగులు చేయగా 332 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో న్యూజిలాండ్  181 పరుగులకే ఆలౌటైంది.