
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ఆ దేశ పోలీసులు ప్రయత్నాలు ప్రారం భించారు. యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసినందుకు హసీనాపై కేసు నమోదైందని, ఆమెతోపాటు మరో 11 మంది నిందితుల అరెస్ట్ కోసం నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్కు విజ్ఞప్తి చేశారు. హసీనాపై హత్యలు, అవినీతి ఆరోపణలతో సహా మొత్తం 100కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. గతేడాది విద్యార్థుల తిరుగుబాటుతో సర్కారు కూలిపో గా.. హసీనా భారత్లో తలదాచు కుంటున్న విషయం తెలిసిందే.