వరల్డ్ కప్ లో భారత్ తో జరుగుతున్నా మ్యాచులో బంగ్లాదేశ్ పర్వాలేదనిపించింది.అందరూ తలో చేయి వేస్తూ టీమిండియా ముందు డీసెంట్ టార్గెట్ ఉంచారు. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో బంగ్లా జట్టు తడబడినా నిలబడింది. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు క్యూ కట్టినా ఆఖర్లో పుంజుకంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్చుకున్న బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. లిటన్ దాస్ (82 బంతుల్లో 66 , 7 ఫోర్లు), తాంజిద్ హసన్ (43 బంతుల్లో 51, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సమర్ధవంతంగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ (46 బంతుల్లో 38, 1 ఫొర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో మహ్మదుల్లా (36 బంతుల్లో 46, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి బంగ్లా స్కోరును 250 మార్కును దాటించాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల, కుల్దీప్ కి చెరో వికెట్ దక్కింది.