సాధారణంగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే అందరూ తేలిగ్గా తీసుకుంటారు. ప్రస్తుత వరల్డ్ కప్ లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న భారత్ బంగ్లాను ఓడించడం పెద్ద కష్టం కాదు. అయితే బంగ్లా లాంటి జట్టుని తేలిగ్గా అంచనా వేస్తే మాత్రం ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక విషయం ఇండియన్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది.
చివరిసారిగా భారత్ పై బంగ్లాదేశ్ 2007 వరల్డ్ కప్ లో గెలిచింది. అప్పట్లో ఈ విజయం భారత్ ఇంటిదారి పట్టేలా చేసింది. ఈ ఒక్కటి మినహాయిస్తే ఆ తర్వాత జరిగిన ప్రతి వరల్డ్ కప్ లో బంగ్లాపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇదిలా ఉండగా భారత్, బాంగ్లాదేశ్ మధ్య చివరి నాలుగు వన్డేలను ఒకసారి పరిశీలిస్తే బంగ్లా ఏకంగా మూడు మ్యాచుల్లో విజయం సాధించింది.
గతేడాది డిసెంబర్ లో మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేలు ఓడిపోయిన టీమిండియా.. తాజాగా ఆసియా కప్ లో కూడా పరాజయం పాలైంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో బుమ్రా, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్స్ లో బుమ్రా ప్రాక్టీస్ కి దూరంగా ఉండగా.. షమీ ఎక్కువసేపు బౌలింగ్ చేసాడు. దీంతో తుది జట్టులోకి బుమ్రా స్థానంలో షమీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- ALSO READ | Crickek World Cup 2023: కోహ్లీ నన్ను రెచ్చగొడతాడు.. నా వ్యూహం నాకు ఉంది : బంగ్లా స్టార్ క్రికెటర్
మరోవైపు కిషాన్ కూడా నెట్స్ లో చెమటోడుస్తుండగా.. స్టార్ బ్యాటర్ లలో ఎవరికైనా రెస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇలా కీలక ప్లేయర్లను పక్కన పెట్టి బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే గెలవడానికి మరింతగా శ్రమించాలి. ఉపఖండపు పిచ్ ల మీద బంగ్లా ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో చూడాలి.