IND vs BAN 2024: తొలి రోజు 80 ఓవర్ల ఆట.. టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో బంగ్లాకు బిగ్ షాక్

ప్రపంచంలో ఏ జట్టుకు లేని సమస్య బంగ్లాదేశ్ జట్టుకు వచ్చి చేరింది. బాగా ఆడి టెస్ట్ ఛాంపియన్ షిప్ రేస్ లో ఉన్నా.. ఆ జట్టు చేజేతులా తమ అవకాశాలను చేజార్చుకుంటుంది. మరోసారి స్లో ఓవర్ రేట్ తో బంగ్లా జట్టు కీలకమైన టెస్ట్ ఛాంపియన్ షిప్  పాయింట్లను కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నై వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ 80 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసింది. 

రోజు 90 ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉండగా బంగ్లాదేశ్ 10 ఓవర్లు తక్కువగా వేసింది. ఆర్టికల్ 16.11.2 రూల్  ప్రకారం ప్రతి పెనాల్టీ ఓవర్‌ వేసిన జట్టుకు మొత్తం పాయింట్ల నుండి ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తీసివేయబడుతుంది. దీని ప్రకారం బంగ్లాదేశ్ కీలకమైన 10 పాయింట్లను కోల్పోనుంది. అదే జరిగితే వారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆశలు ప్రమాదంలో పడినట్టే. స్లో ఓవర్ రేట్ కారణంగా బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే పాకిస్థాన్ జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో మూడు కీలకమైన పాయింట్లను కోల్పోయింది. 

ALSO READ :  IND vs BAN 2024: అశ్విన్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ డీసెంట్ టోటల్

ప్రస్తుతం బంగ్లాదేశ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 10 పాయింట్లు కోల్పోవడంతో పాటు టెస్ట్ మ్యాచ్  ఓడిపోతే బంగ్లా 6 లేదా 7 వ స్థానానికి పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ సెంచరీ (113) తో చెలరేగగా..  జడేజా (86), జైశ్వాల్ (56) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్ కు ఐదు వికెట్లు దక్కాయి.