Women's Asia Cup 2024: బంగ్లాదేశ్‌తో సెమీ ఫైనల్.. టీమిండియా బౌలింగ్

Women's Asia Cup 2024: బంగ్లాదేశ్‌తో సెమీ ఫైనల్.. టీమిండియా బౌలింగ్

మహిళల ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా నేడు ఇండియా నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరుకు రెడీ అయ్యింది. శుక్రవారం (జూలై 26) జరిగే సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సెమీస్ సమరంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా అదే జోరును కంటిన్యూ చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ పటిష్టమైన భారత్ ను ఓడించి షాక్ ఇవ్వాలని చూస్తుంది. 

మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ చివరి మ్యాచ్‌‌‌‌లో 82 రన్స్‌‌‌‌ తేడాతో నేపాల్‌‌‌‌ జట్టును చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్ గా నిలిచింది. గ్రూప్ బి లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో బంగ్లాదేశ్ రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచి సెమీస్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. రాత్రి జరిగే మరో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది.    

భారత మహిళలు (ప్లేయింగ్ XI):
 
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్

బంగ్లాదేశ్ మహిళలు (ప్లేయింగ్ XI):

దిలారా అక్టర్, ముర్షిదా ఖాతున్, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), రుమానా అహ్మద్, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబెయా ఖాన్, షోర్నా అక్టర్, నహిదా అక్టర్, జహనారా ఆలం, మారుఫా అక్టర్