546 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బంగ్లా రికార్డు విక్టరీ

546 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బంగ్లా రికార్డు విక్టరీ

మీర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు తమ టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చరిత్రలో అతి పెద్ద విజయంతో రికార్డు సృష్టించింది. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 546 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో గెలుపొందింది. ఆతిథ్య బంగ్లా ఇచ్చిన 662 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 45/2తో  నాలుగో రోజు, శనివారం రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగించిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 115 వద్ద ఆలౌటైంది. రహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా (30) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్కోరర్​. తస్కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా (4/37) నాలుగు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 382, అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 146 స్కోర్లు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  బంగ్లా 425/4 వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. నజ్ముల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంటోకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దక్కింది. ఈ గెలుపుతో 2005లో జింబాబ్వేపై (226 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో)పై తమ హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్టరీ రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది మూడో బిగ్గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్టరీ. 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 675 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నెగ్గగా, 1934లో ఆస్ట్రేలియా 562 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ఓడించింది..