సొంతగడ్డపై పాకిస్థాన్ కు ఊహించని పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ పై రెస్ట్ టెస్టుల సిరీస్ కు 0-2 తేడాతో ఓడిపోయింది. రావల్పిండి వేదికగా ముగిసిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో పాక్ ను ఓడించి బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. వికెట్ నష్టపోకుండా 44 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో చివరి రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేజ్ చేసింది . దీంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలిచి పాక్ ను తమ సొంత దేశంలో మట్టి కురిపించింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 274 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులకే పరిమితమైంది. 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. లిటన్ దాస్ (138) అద్భుత సెంచరీకి తోడు మెహదీ హసన్ మిరాజ్ (78) హాఫ్ సెంచరీతో ఆ జట్టును గట్టెక్కించారు. 12 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన పాక్ కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. 185 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 4 వికెట్లను కోల్పోయి ఛేజ్ చేసింది.
ఈ ఓటమితో పాక్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. ప్రస్తుతం మరోవైపు బంగ్లాదేశ్ 2-0 తో వైట్ వాష్ చేయడంతో ఆ జట్టు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ చిత్తయిన సంగతి తెలిసిందే.
ALSO READ : Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. అనంతపురం చేరుకున్న భారత క్రికెటర్లు
సొంతగడ్డపై పాకిస్థాన్ కు ఊహించని పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ పై రెస్ట్ టెస్టుల సిరీస్ కు 0-2 తేడాతో ఓడిపోయింది. రావల్పిండి వేదికగా ముగిసిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో పాక్ ను ఓడించి బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.