
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్, భారత్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. "వికెట్ బాగుంది. మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ టీమిండియా ముందు పెడతాం. మా ప్లేయర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు". అని బంగ్లా కెప్టెన్ శాంటో టాస్ అనంతరం చెప్పాడు.
Also Read :- బాబర్‌ను తాబేలుతో పోల్చిన అశ్విన్
గ్రూప్ ఏ లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. బలహీనమైన బంగ్లాపై భారీ విజయం సాధించాలని టీమిండియా భావిస్తుంటే.. రోహిత్ సేనకు ఎలాగైనా షాక్ ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ముగ్గురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతుంది. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు.. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్.. ఐదుగురు బ్యాటర్లు భారత జట్టులో ఉన్నారు.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్