
చట్టోగ్రామ్: తౌహిద్ హ్రిదోయ్ (57), జాకెర్ అలీ (44) చెలరేగడంతో.. మంగళవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ 9 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 3–0తో లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 165/5 స్కోరు చేసింది. తన్జిద్ హసన్ (21)తో మూడో వికెట్‌కు 31 రన్స్ జోడించిన హ్రిదోయ్.. జాకెర్‌తో నాలుగో వికెట్‌కు 87 రన్స్ జోడించాడు. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 156/9 స్కోరుకే పరిమితమైంది. ఫరాజ్ అక్రమ్ (34), మురుమణి (31) మాత్రమే రాణించారు. 91 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను మసకద్జా (13), ఫరాజ్ అక్రమ్ 9వ వికెట్‌కు 54 రన్స్ జోడించి ఆశలు రేకెత్తించారు.