కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ వీరాభిమాని టైగర్ రోబీని గ్రీన్ పార్క్ స్టేడియంలో కొంతమంది ప్రేక్షకులు పొత్తికడుపు కింది భాగంలో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని అక్కడ ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అతన్ని స్టేడియం నుండి బయటకు తీసుకెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారు తన వీపు మీద, పొత్తికడుపుపై కొట్టారని ఆ సమయంలో తాను ఊపిరి పీల్చుకోలేకపోయాయనని స్పోర్ట్‌స్టార్ రాబి చెప్పినట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. రెండో టెస్టు తొలి రోజు ఆటలో గ్రీన్ పార్క్ స్టేడియంలో బంగ్లాదేశ్ జెండాను ఊపుతూ సి-బ్లాక్ బాల్కనీ నుంచి నినాదాలు చేస్తూ రోబీ కనిపించాడు. లంచ్ సమయంలో, కొంతమంది స్థానిక ప్రేక్షకులు తనను కొట్టారని రోబీ ఆరోపించాడు, అయితే స్థానిక పోలీసు అధికారులు అధికారిక సిసిటివి ఫుటేజీని ధృవీకరించి అతని ఆరోపణలను పరిశీలిస్తారని చెప్పారు.
ఇక ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు వర్షం కారణంగా 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి రోజు ముగిసేసమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40), రహీం (6) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు రెండు.. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.
Bangladesh super fan Tiger Robi has claimed he was assaulted by a mob of around 15 people on Day 1 of the second Test match between #India and #Bangladesh at the Green Park Stadium in Kanpur. However, the UP police have refuted Robi’s claim, saying he collapsed because of… pic.twitter.com/kLk5HqOV7c
— Deccan Chronicle (@DeccanChronicle) September 27, 2024