టెర్రరిస్టుతో బంగ్లాదేశ్​ నేత భేటీ.. పహల్గాం​ దాడి జరిగిన మరుసటిరోజే సమావేశం

టెర్రరిస్టుతో బంగ్లాదేశ్​ నేత భేటీ.. పహల్గాం​ దాడి జరిగిన మరుసటిరోజే సమావేశం

న్యూఢిల్లీ: పహల్గాం​ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే.. పొరుగుదేశం బంగ్లాదేశ్​మాత్రం భారత వ్యతిరేక వైఖరిని కనబరుస్తోంది. జమ్మూకాశ్మీర్​లోని బైసరన్​లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన మరుసటిరోజే స్థానిక లష్కరే తోయిబా (ఎల్​ఈటీ) మిలిటెంట్​ ఇజార్​తో బంగ్లా లీగల్​ అడ్వైజర్​ డాక్టర్​ ఆసిఫ్​ నజ్రుల్​ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా వేదికగా ఈ సమావేశం జరిగినట్టు పలు కథనాలు వెలువడ్డాయి. 

బంగ్లా గడ్డ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఇజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉంది. పహల్గాం​దాడికి పాల్పడింది ఎల్​ఈటీ అనుబంధ సంస్థ ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్)​ అని ఇండియన్​ ఇంటెలిజెన్స్​ఏజెన్సీలు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురి భేటీ ఉగ్రవాదం విషయంలో  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాత్కాలిక ప్రభుత్వ విధానంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.