ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని మహ్మద్ యూనస్ ఫోన్..కీలక అంశాలపై హామీ

ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని మహ్మద్ యూనస్ ఫోన్..కీలక  అంశాలపై హామీ

ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్మద్ యూనస్ శుక్రవారం ఆగస్టు 16, 2024 న ఫోన్ చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులు, ఇతర మైనా ర్టీల రక్షణ, భద్రతకు బంగ్లాదేశ్ కట్టుబడి ఉందని యూనస్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా బ్లాగ్ Xలో షేర్ చేశారు. 

బంగ్లాదేశ్లో ఇటీవల హింస చేలరేగిన క్రమంలో అక్కడి హిందువులు, ఇతర మైనార్టీల భద్రతపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో బంగ్లాదేవ్ లో హిందువులపై దాడులు ఆందోళనకరం అని అన్నారు. 

మరుసటి రోజు అయిన శుక్రవారం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ ప్రధాని మోదీతో ఫఓనల్ మాట్లాడారు. బంగ్లాదేశ్ లోని హిందువులు, ఇతర మైనార్టీల రక్షణ, భద్రతకు కట్టుబడి ఉన్నామని అన్నారు. 

బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అశాంతి మధ్య మైనార్టీ వర్గాలను కాపాడేందుకు అసవరమైన అన్ని చర్యలు తీసుకుంటామని యూనస్ హామీ ఇచ్చారని మోదీ తన పోస్ట్ లో చెప్పారు. బంగ్లాదేశ్ లోని శాంతియుత పరిస్థితులు, స్థిరత్వంకోసం భారత మద్దతును తెలిపారు. బంగ్లాదేశ్ లో అన్ని వర్గాలకు భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.