హైదరాబాద్సిటీ, వెలుగు : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో రూ.2కోట్ల అంచనాతో బంజారా భవన్నిర్మాణానికి ఇటీవల వేసిన శిలా ఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఈ నెల 15న మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు భవనం నిర్మాణ పనులను ప్రారంభిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనిని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గిరిజన సంఘాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.