కేటీఆర్పై బంజారా హిల్స్ పీఎస్లో క్రిమినల్ కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2 వేల 500 కోట్లు వసూలు చేసి.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు బత్తిన శ్రీనివాస్ రావు.

రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడారని.. ఆయన పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకున్నా తప్పుడు మాటలు, నిరాదారా ఆరోపణలు చేయడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలిగి పార్టీల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉంది.. కాబట్టి కేటీఆర్ పై చట్టరీత్యా కటిన చర్యలు తీసుకోవాలని కోరారు బత్తిన శ్రీనివాస్ రావు.
  
అయితే ఈ కేసును హనుమకొండ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ కాగా.. కేసును బంజారా హిల్స్ పీఎస్ కు పంపించారు పోలీసులు. కేటీఆర్ పై బత్తిన శ్రీనివాస్ రావు చేసిన ఫిర్యాదులో భాగంగా IPC 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్  పోలీసులు.