- బంజారా సేవాలాల్ సమితి డిమాండ్
సోమాజిగూడ, వెలుగు : బంజారా జాతిపై పరిశోధన చేసి వారి అభివృద్ధికి జాతీయ బంజారా కమిషన్ ఏర్పాటు చేయాలని దక్షిణ భారత, మహారాష్ట్ర , మధ్య భారత్ బంజారా సేవాలాల్ సమితి డిమాండ్ చేసింది. బంజారాలకు రాజకీయ అధికారం ఇవ్వాలని కోరింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించగా మాజీ మంత్రి రవీంద్రనాయక్ ప్రారంభించారు. ఇందులో డీబీఎంబీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ భరత్ జి. రవినాయక్, ఈబీసీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు.
ALSO READ: ఆసియా గేమ్స్‌లో కాంపిటీషన్ టఫ్ : సాత్విక్ సాయిరాజ్
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంజారాలు ఓబీసీలుగా ఉన్నారని, ప్రత్యేక కేటగిరి కింద సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు, పథకాలు చేపడుతూ.. వారిని ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. హైదరాబాద్‌లోని బంజరాహిల్స్ లో సేవాలాల్, జగదాంబ భవ్య మందిరాలను నిర్మించి,10 ఎకరాల స్థలంలో బంజారా రీసెర్చ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.