రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ క్యాషియర్ మృతి

వరంగల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బ్యాంకు క్యాషియర్ చనిపోయాడు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపుర మండలం శనిగరంలోని UIB బ్యాంకు లో శంకర్  క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి తన సొంత కారులో శనిగరంకు… వెళ్తుండగా కరీంనగర్ – వరంగల్ ప్రధాన రహదారి పై చెట్టుకు ఢీ కొని అక్కడిక్కడే చనిపోయాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు… స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కున్న శంకర్ ను బయటకు తీసారు.